Arekapudi Gandhi: ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యత తీసుకుంటా
ABN , Publish Date - Jan 20 , 2025 | 04:08 AM
తెలుగుజాతి ఇలవేల్పు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొనియాడారు.

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
హైదర్‌నగర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఇలవేల్పు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ నిర్వహణపై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఎమ్మెల్యే గాంధీ స్పందించారు. ఈ విషయంపై హెచ్‌ఎండీఏ అధికారులతో మాట్లాడి సమాచారం తీకున్నానని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆదివారం తెలిపారు.
ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలు తాను తీసుకుంటానని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలు చేపట్టేలా తన వంతు ప్రయత్నం చేస్తానని గాంధీ పేర్కొన్నారు.