Share News

Dangerous Games: బెట్టింగ్ యాప్స్‌లో ఈ గేమ్స్ జోలికి వెళ్తే నరకాన్ని చూస్తారు

ABN , Publish Date - Mar 21 , 2025 | 10:50 AM

హైదరాబాద్‌‌లోని వినాయకనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకడు తరుణ్ రెడ్డి బెట్టింగ్‌‌ యాప్‌‌లకు ఆకర్షితుడై అప్పులపాలై ఈఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగి కిశోర్ కుమార్ బెట్టింగ్ యాప్ కారణంగా ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు ఆశ చూపించి బెట్టంగ్ ఊబిలోకి దించి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తుండటంతో బెట్టింగ్ యాప్స్ కారణంగా ముఖ్యంగా యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.

Dangerous Games: బెట్టింగ్ యాప్స్‌లో ఈ గేమ్స్ జోలికి వెళ్తే నరకాన్ని చూస్తారు
Betting Apps

బెట్టింగ్ యాప్స్‌‌పై ముఖ్యంగ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఓవైపు మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొత్త రకాల పేర్లతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌‌గా బెట్టింగ్ యాప్‌‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. పోలీసులు ప్రమోటర్లపై కేసులు పెట్టి, చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ బెట్టింగ్ మాఫియా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. బెట్టింగ్ యాప్ నిర్వహకులపై చర్యలు తీసుకోవడంలేదని, దీంతో బెట్టింగ్ యాప్‌లను కట్టడి చేయడం కష్టంగా మారిందనే చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్‌‌లు చాలామంది వ్యక్తులను ఆర్థికంగా కుంగదీస్తోంది. బెట్టింగ్‌‌కు బానిసగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువుగా చూస్తు్న్నాం. 2024వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో వెయ్యిమంది ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసులు ప్రకటించడం చూస్తుటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు .


హైదరాబాద్‌‌లోని వినాయకనగర్‌కు చెందిన ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువకడు తరుణ్ రెడ్డి బెట్టింగ్‌‌ యాప్‌‌లకు ఆకర్షితుడై అప్పులపాలై ఈఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండకు చెందిన ఓ ప్రయివేట్ ఉద్యోగి కిశోర్ కుమార్ బెట్టింగ్ యాప్ కారణంగా ఫిబ్రవరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డబ్బు ఆశ చూపించి బెట్టంగ్ ఊబిలోకి దించి బయటకు రాలేని పరిస్థితులు కల్పిస్తుండటంతో బెట్టింగ్ యాప్స్ కారణంగా ముఖ్యంగా యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్‌లో డేంజరస్ గేమ్స్ గురించి తెలుసుకుందాం.


వాటి జోలికి వెళ్లొద్దు

బెట్టింగ్ యాప్స్‌‌లో ఒరిజినల్ గేమ్స్ కంటే వర్చువల్ గేమ్స్‌‌ దందా ఎక్కువుగా నడుస్తోంది. ఒరిజినల్ గేమ్ అంటే రెండు జట్లు రియల్‌‌గా తలపడతాయి. ఈ గేమ్స్‌‌లో గెలుపోటములు జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. కానీ వర్చువల్ గేమ్స్‌లో మాత్రం గెలుపోటములను కొందరు వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ సొమ్ము ఆధారంగా.. లాభ, నష్టాలను అంచనా వేసుకుని కొందరు గెలుపోటమును నిర్ణయించే అవకాశం ఉండొచ్చు. అలాగే రమ్మీ, నంబర్ గేమ్, కార్డు గేమ్స్‌‌లో గ్యాబ్లింగ్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌‌ నిర్వాహకులకు ఎక్కువు లాభాలు తెచ్చిపెట్టేది వర్చువల్ గేమ్స్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.


కార్డు గేమ్స్‌‌లో రమ్మీ, 7అప్‌ 7 డౌన్, తీన్‌పతి, అందర్ బహార్, పూల్ రమ్మీ, ఏకే 47, డ్రాగన్ అండ టైగర్, పప్పు, విన్ డ్రాప్ వంటి గేమ్స్‌ను ఎవరు ఆపరేట్ చేస్తారనే విషయం తెలియదు. ఈ గేమ్స్‌‌ ఫలితాలను ఎవరైనా వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు 7 అప్‌‌ 7 డౌన్ గేమ్‌లో ఒకసారి7 అప్ మీద మొత్తం బెట్ రూ.10 వేలు, 7 డౌన్ మీద మొత్తం బెట్ రూ.11వేలు వచ్చి.. 7 మీద రూ. వెయ్యి వస్తే సాధారణంగా ఆ గేమ్‌‌లో ఫలితం 7 రావొచ్చు. అప్పుడు అప్, డౌన్‌పై బెట్ వేసినవాళ్లు డబ్బులు నష్టపోతారు. ఒకసారి 7 వచ్చింది కాబట్టి తరువాత అప్, డౌన్ రావొచ్చనే ఆశతో మళ్లీ అప్‌‌, డౌన్‌‌పై వేస్తే వరుసగా కొన్నిసార్లు 7 రావొచ్చు. అంటే బెట్టింగ్ నిర్వహకుడు తనకు అనుకూలంగా ఫలితం ఉండేలా చూసుకుంటారనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఇలాంటి వర్చువల్ గేమ్స్ ఆడితే ఆర్థికంగ నష్టపోవడమే తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్డ్.. కాసేపట్లో విడుదల..

Hyderabad: ఇందిరాపార్కులో టాయ్‌ ట్రైన్‌..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 21 , 2025 | 10:50 AM