Share News

బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:29 PM

బీసీల రిజర్వేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42శాతం రిజర్వేషన్‌ను కేంద్రం స త్వరమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నీలకంఠేశ్వరావు పేర్కొన్నారు.

బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలి

బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి31 (ఆంధ్రజ్యోతి): బీసీల రిజర్వేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42శాతం రిజర్వేషన్‌ను కేంద్రం స త్వరమే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నీలకంఠేశ్వరావు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాలలో సభ నిర్వహించి అనంతరం రైలులో ఢిల్లీకి బయలు దేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని మూడు రో జుల పాటు ధర్నా చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42శాతం బీసీ రిజర్వేషన్‌ తీర్మాణం చేయడం హర్షనీయమని కేంద్రం కూ డ దేశవ్యాప్తంగా బీసీ గణన చేపట్టాలని, రాష్ట్రంలో బీసీ 42శాతం రిజ ర్వేషన్‌ పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పా ర్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన పోరు గర్జనకు సంబంధించి బీసీ లందరూ ఏకతాటిపై రావడం ఐక్యంగా పోరాడి రిజర్వేషన్‌ సాధించు కో వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న యాద వ్‌, రాజ్‌కిరణ్‌, సాయిక్రిష్ణ, వెంకటేశ్‌, వేణుగోపాల్‌, రాయబారపు కిరణ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:29 PM