సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:01 PM
గ్రా మాల్లో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమ త్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ డీ ఎస్పీ గిరికుమార్ అన్నా రు.

- సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరికుమార్
పెద్దకొత్తపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : గ్రా మాల్లో ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమ త్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ డీ ఎస్పీ గిరికుమార్ అన్నా రు. గురువారం మండల కేంద్రమైన పెద్దకొత్తపల్లి లోని మండల మహిళా సమాఖ్య భవనంలో మహిళా సంఘాల సభ్యులకు శ్రామిక వికాసం కేంద్రం ఆధ్వర్యంలో ‘సైబర్ నేరాలు, పిల్లలపై వాటి ప్రభావం’ అనే అంశంపై అవగాహన స దస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. 2019 సంవత్సరం నుంచి పోల్చుకుంటే ప్రస్తుతం క్రైమ్ రేటు 60 శాతా నికి పైగా పెరిగిందన్నారు. ప్రతీ ఒక్కరు అప్ర మత్తతతో ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా వారికి వ్యక్తిగత విషయాలు చెప్పరాదని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు రాత్రి పూట ఎక్కువ సమయం పెద్ద ఫోన్లు ఇవ్వరాదని సూచించారు. ప్రతీ ఒక్కరు హెల్ప్‌లైన్ 100ను వినియోగించుకోవాలని, అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే గోల్డెన్ అవర్‌లోనే 1930కు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక వికాస కేంద్రం డైరెక్టర్ లక్ష్మణ్‌రావు, డీసీపీయూ మల్లేష్, సఖి అడ్మిన్ సునీత, ఏపీఎం అరుణ, సీడబ్ల్యూసీ మెంబరు విష్ణు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుణ, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ తిరుపాల్ పాల్గొన్నారు.