Share News

Chennai: ‘ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్‌ షా

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:21 PM

హోంశాఖ మంత్రి అమిత్‌ షాను భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపంగా చూస్తున్నామంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్‌ అభివర్ణించారు. అలాగే.. తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయనన్నారు.

Chennai: ‘ఉక్కు మనిషి’కి ప్రతిరూపమే అమిత్‌ షా

- మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌

చెన్నై: భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపమే హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Sha)ను చూస్తున్నారని అన్నాడీఎంకే మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్‌(RB Uday Kumar) అభివర్ణించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సుమారు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు.

ఈ వార్తను కూడా చదవండి: Special Trains: చెన్నై సెంట్రల్‌-ముంబై(వయా కడప) ప్రత్యేక వారాంతపు రైళ్లు


బీజేపీతో కూటమి ఏర్పాటుపై చర్యలు సాగినట్లు వచ్చిన వార్తలను పళనిస్వామి ఖండించారు. ఈ నేపథ్యంలో, అమిత్‌షాతో పళనిస్వామి సమావేశం కావడంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆర్బీ ఉదయకుమార్‌ వీడియో విడుదల చేశారు. అందులో... భారత ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రతిరూపమైన హోంశాఖ మంత్రి అమిత్‌ షాను,


nani6.2.jpg

తమిళనాడు ఉక్కు మనిషి ఎడప్పాడి పళనిస్వామి కలుసుకున్న వ్యవహారంలో పలు వార్తలు వెలువడుతున్నాయని, రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిపేందుకు పళనిస్వామి ఢిల్లీ వెళ్లారని తెలిపారు. పళనిస్వామి-అమిత్‌ షా(Palaniswami-Amit Sha) సమావేశంలో ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా అన్నాడీఎంకే కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టాలని ఉదయకుమార్‌ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

పాస్టర్‌ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు

మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2025 | 12:21 PM