Bandi Sanjay: ఐదు నెలల్లో బీజేపీదే అధికారం
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:55 PM
Bandi sanjay: తెలంగాణలో మరో ఐదు నెలలు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటువుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంగా మారిందని ఆయన అభివర్ణించారు.

మంచిర్యాల, ఫిబ్రవరి 18: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో 5 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. మంగళవారం మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విజిలెన్స్ విచారణ ముగిసినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేసు కేసులు ఎందుకు నీరుగారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా మారిందన్నారు. న్యూఢిల్లీకి వెళ్లగానే.. కేసులన్నీ ఆగి పోతున్నాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. 317 జీవో రద్దు కోసం కోట్లాడింది బిజేపీ పార్టీనేనని ఆయన తెలిపారు.
Also Read: మొలకెత్తిన మెంతులు తింటే ఇన్ని లాభాలా..?
ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు.. కేవలం బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప తాగి.. బండి సంజయ్ ఆఫీస్‌ను జేసిబితో కూల్చమని ఆదేశాలు జారీ చేశారని బండి సంజయ్ చెప్పారు. గ్రూప్ -1 పేపర్ లీకైందని తాను నిరసనలు చేస్తే, 10 వ తరగతి హిందీ పేపర్ లీకు చేశారంటూ కేసీఆర్ కేసులు పెట్టారని వివరించారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు సైతం దొరక లేదని ఎద్దేవా చేశారు.
Also Read: జగన్‌కు చురకలంటించిన లోకేష్
Also Read: జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రం
నిరుద్యోగులకు, టీచర్‌లకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి నెరవేర్చ లేదన్నారు. కాంగ్రెస్‌కి ఎందుకు ఓటు వేయాలని.. ఆ పార్టీ నేతలను నిలదీయండంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read: విడదల రజినికి తాత్కాలిక ఊరట
Also Read: జగన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించిన ఏపీ టీడీపీ చీఫ్
ఇదిలా ఉంటే.. రంజాన్ భక్తులకు డ్యూటీ మినహాయింపును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పు పట్టారు. మా అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంది? అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. రంజాన్ భక్తులకు మాత్రమే డ్యూటీ మినహాయింపు ఇస్తారా?.. అయ్యప్ప, భవానీ, మనుమాన్ భక్తులకు మినహాయింపు ఎందుకివ్వరంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Also Read: వాయిదా పడనున్న కేబినెట్ భేటీ !
Also Read: జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు
కాంగ్రెస్ నేతలారా... అసలు మీలో హిందువుల రక్తం ప్రవహిస్తుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే స్పందించరా? అంటూ కాంగ్రెస్ పార్టీ కేడర్‌పై ఆయన నిప్పులు చెరిగారు. పోని ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. తమపై మతతత్వ ముద్ర వేస్తారా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
For Telangana News And Telugu News