Share News

MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:19 AM

మంత్రి మైక్‌ లాక్కొని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలపై నమోదైన 2021 నాటి కేసు కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని

MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పిటిషన్‌

2021లో అప్పటి మంత్రి జగదీశ్‌ రెడ్డి మైకు లాక్కొన్నట్టు ఆరోపణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మంత్రి మైక్‌ లాక్కొని, ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలపై నమోదైన 2021 నాటి కేసు కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మండలం లక్కారంలో 2021 జూలై 26న అప్పటి ప్రభుత్వం నిర్వహించిన ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ నెలకొంది. అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రొటోకాల్‌ పాటించకుండా, సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ రాజగోపాల్‌రెడ్డి మైకు లాక్కొని అడ్డుకున్నారు. దాంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించకుండా అడ్డుపడ్డారని చౌటుప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని తాజాగా రాజగోపాల్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, ఫిర్యాదుదారు అయిన తహసీల్దార్‌కు నోటీసులు జారీచేసింది. విచారణ ఈనెల 11కు వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 05:19 AM