రెల్లి ఉప కులాలకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:40 PM
రెల్లి ఉప కులాలకు రిజర్వేషన్లలో న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేయాలని ఆ సంఘ నాయకులు బెవర రాము, బూరెల శంకరరావు అన్నారు.

నరసన్నపేట, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రెల్లి ఉప కులాలకు రిజర్వేషన్లలో న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేయాలని ఆ సంఘ నాయకులు బెవర రాము, బూరెల శంకరరావు అన్నారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వాలు చేపట్టిన ఎస్సీ వర్గీకరణకు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. సాంఘికంగా వెనుకబడి ఉన్న రెల్లి, ఉపకులాలను ఆదుకో వాలని డిమాండ్ చేశారు. ఆ సంఘ నేతలు డేవిడ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.