Share News

సీపీఎం పూర్వ వైభవానికి కృషిచేయాలి : మల్లు

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:29 AM

దేశ, రాష్ట్రంలో అధికారం చెలాయించిన అనేక పార్టీల విధానాలను చూసి విస్తుపోయి ప్రజల కోసం పని చేసే ఏకైక జెండా ఎర్రజెండా మాత్రమేనని నమ్మి సీపీఎం ప్రజా సంఘాల్లో చేరడం అభినందనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు.

సీపీఎం పూర్వ వైభవానికి కృషిచేయాలి : మల్లు
సీపీఎంలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి

మద్దిరాల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): దేశ, రాష్ట్రంలో అధికారం చెలాయించిన అనేక పార్టీల విధానాలను చూసి విస్తుపోయి ప్రజల కోసం పని చేసే ఏకైక జెండా ఎర్రజెండా మాత్రమేనని నమ్మి సీపీఎం ప్రజా సంఘాల్లో చేరడం అభినందనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. మండలంలోని గోరెంట్ల గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఎంఈవో బంధు కృష్ణయ్యతో పాటు మరో పది కుటుంబాలు శనివారం సీపీఎంలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దోపిడీ వ్యవస్థను కూలదోయడం కోసం పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల హక్కుల కోసం కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహించి జిల్లాలో పార్టీని బలో పేతం చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పొట్టబత్తుల లక్ష్మీనారాయణ, దీకొండ రంగయ్య, తడకమల్ల హుస్సేన్‌, మరిపెద్ది ముత్తయ్య, సైదుల మధుసూదన్‌ ఉన్నారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి పోలోజు సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, కందాళ శంకర్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌, బద్దం మల్లారెడ్డి, కన్న వీరన్న, వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:29 AM