Share News

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:37 PM

మండల కేంద్రంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో ఆదివారం నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జ నార్దన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు పులేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జన్మదిన వేడుకలు
బిజినేపల్లి అంబేడ్కర్‌ చౌరస్తాలో మర్రి జన్మదినం పురస్కరించుకొని కేక్‌ కట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు

బిజినేపల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యో తి) : మండల కేంద్రంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో ఆదివారం నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జ నార్దన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు పులేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా మర్రి జనా ర్దన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేశారని కొనియాడా రు. రాబోయ్యే రోజుల్లో కందనూలు గడ్డపై గు లాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. వారి వెంట మాజీ వైస్‌ ఎంపీపీ చిన్నారెడ్డి, మాజీ మండల రైతు బంధు అధ్యక్షుడు మహే శ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు తిరుపతిరెడ్డి, చీర్ణం బాలస్వామి, ఆయా గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే హైద రాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ యువజన మండల అధ్యక్షుడు ముడావత్‌ రాము నాయక్‌, ముడావత్‌ వంశీ నాయక్‌, మాజీ సర్పంచ్‌ లింబ్యానాయక్‌లు గిరిజన యువకులతో కలిసి ఆయనతో కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:37 PM