Share News

ఇచ్చిన హామీలను నెరవేరుస్తా

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:47 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చెన్నూరు నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేరుస్తా
ప్రత్యేక పూజలు చేస్తున్న ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

-నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

-ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చెన్నూరు నియోజకవర్గాన్ని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పండగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ. 40 కోట్ల వ్యయంతో గోదావరి నది నుంచి చెన్నూరు ప్రజలకు తాగునీరు అందించేందుకు గాను ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇందులో భాగంగా అమృత్‌ 2.0 పథకం ద్వారా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గానికి రెండు టీఎంసీల నీటిని ఇవ్వాలని కోరామన్నారు. సానుకూలంగా స్పం దించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2 టీఎంసీల నీటిని అందించేందుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అటవీ శాఖ అనుమతులు రాక చాలా చోట్ల వంతెనల నిర్మాణాలు జరగడం లేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వ భూములను అటవీ శాఖకు ఇచ్చి వంతెనల నిర్మాణాలకు అనుమతులు తీసుకురావాలని కోరానని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యపై ఆరా తీస్తూ ట్రాఫిక్‌ నియంత్రణకు అధికారులు కృషి చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న బైపాస్‌ రహదారి నిర్మాణానికి నిధులు కేటా యించి రహదారిని పూర్తి చేయిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలు పుతూ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

Updated Date - Mar 30 , 2025 | 11:47 PM