Share News

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:12 PM

రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా రెవెన్యూ ఉద్యోగులు సైనికుల్లాగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి పేర్కొన్నారు.

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా రెవెన్యూ ఉద్యోగులు సైనికుల్లాగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలులో రెవెన్యూ ఉద్యో గుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి అందుబా టులో ఉండే విధంగా ప్రభుత్వం త్వరలోనే గ్రామపా లన అధికారులను అందుబాటులోకి తేనున్నట్లు చె ప్పారు. ప్రభుత్వం ఒక వైపు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూనే మరో వైపు రైతులకు, ప్రలకు మెరుగైన రెవెన్యూ సేవలను క్షేత్రస్ధాయిలో అందించే విధంగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు అండగా నిలుస్తుందని, గ్రా మానికో అధికారిని ఏర్పాటు చేసేందుకు 10,954 పో స్టుల భర్తీకి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం జీ వో నెంబరు 317తో ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిం దని, జేఏసీ ఉద్యమం ఫలితంగా స్పౌజ్‌, మెడికల్‌ తదితర కోణాల్లో ప్రభుత్వం బదిలీలను చేసింద న్నా రు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ అంశాలను అం తా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం ఏ ర్పడిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఉ మ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని ఆత్మీయ స మ్మేళనాలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజు ల్లో మరిన్ని విజయాలు సాధించుకుందామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కలెక్టర్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్‌, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బానాల రాంరెడ్డి, బిక్షం, ఆదిలాబాద్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామలదేవి, మంచిర్యాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి శ్రీనివాస్‌, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:12 PM