Share News

Abhishek Mahanti: ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Mar 25 , 2025 | 04:27 AM

ఏపీ, తెలంగాణ మధ్య అఖిలభారత అధికారుల క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి సోమవారం హైకోర్టులో ఊరట లభించింది.

Abhishek Mahanti: ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ మధ్య అఖిలభారత అధికారుల క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో కేసులో తుది తీర్పు వెలువడే వరకు ఆయన తెలంగాణ సర్వీసుల్లోనే కొనసాగవచ్చని ఆదేశాలు జారీచేసింది. ఏపీ క్యాడర్‌లో చేరాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అభిషేక్‌ మహంతి క్యాట్‌లో సవాల్‌ చేశారు. తెలంగాణలోనే ఉండే విధంగా క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.


ప్రభాకర్‌రావు బెయిల్‌పై స్పందన ఏంటి?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రభాకర్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ శ్రీనివాసరావు ధర్మాసనం.. ప్రభుత్వ వివరణ తెలియజేయాలని ఆదేశించింది.

Updated Date - Mar 25 , 2025 | 04:27 AM