Share News

Metro Rail: మెట్రోకు 1100 పాతబస్తీ

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:06 AM

హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,100 కోట్లు కేటాయించారు.

Metro Rail: మెట్రోకు 1100  పాతబస్తీ

  • కారిడార్‌ పనులకు 500 కోట్లు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,100 కోట్లు కేటాయించారు. రెండో దశలో నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రాయదుర్గ్‌-కోకాపేట్‌ , ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట (పాత బస్తీ) , మియాపూర్‌-పటాన్‌చెరు, ఎల్‌బీ నగర్‌-హయత్‌నగర్‌ మెట్రో పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పాత బస్తీ కారిడార్‌కు రూ.500 కోట్లు, ఎయిర్‌పోర్టు కారిడార్‌కు రూ.100 కోట్లు, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు రుణాల కింద రూ.500 కేటాయించింది.


మూసీకి రూ.1500 కోట్లు

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కూడా రూ.1500 కోట్లు కేటాయించారు. గత ఏడాది కూడా ప్రగతి పద్దు కింద రూ.1500 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.

Updated Date - Mar 20 , 2025 | 05:06 AM