Kishan Reddy: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. బీజేపీ టార్గెట్ ఫిక్స్
ABN, Publish Date - Mar 31 , 2025 | 03:09 PM
Kishan Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. కీలక అంశాలపై కిషన్‌రెడ్డి చర్చించారు.
సంస్థాగత వ్యవహారాలపై కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మిగిలిన జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు పూర్తి చేయాలని చర్చించారు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటాలకు సిద్ధం చేసేలా బీజేపీ కేడర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆరు గ్యారెంటీలపైన రైతుల తరపున పోరు బాట పట్టేలా తీసుకోవాల్సిన చర్యలపై కిషన్‌రెడ్డి చర్చించారు. రాష్ట్రంలోని ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ నేతలు ఇంకా పోరాటాలు చేయాలని, అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నామని అన్నారు. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము గెలిచామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేసినా రెండు సీట్లు తాము గెలిచామని అన్నారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోటీ చేయలేదని.. కాంగ్రెస్ ఎన్నికల ముందే చేతులు ఎత్తేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకూ రేవంత్ ప్రభుత్వం చూస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని .. పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ కేడర్‌కు పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. పోరాటాల ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కమిటీలను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాలని చెప్పారు. అంబేడ్కర్ జయంతి సమయం లోపుల కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
వందశాతం బూత్, మండల కమిటీలు పూర్తి చేసుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. రైతు, విద్యుత్ కోతలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని చెప్పారు. యువమోర్చా, మహిళా సమస్యలపై మహిళా మోర్చా పోరాటాలు చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలనే నినాదంతో ముందుకు పోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Mar 31 , 2025 | 03:59 PM