Share News

Kishan Reddy: ఆ విషయం నిరూపించాలి.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి మాస్ సవాల్

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:08 PM

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని సవాల్ విసిరారు.

 Kishan Reddy: ఆ విషయం నిరూపించాలి.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి మాస్ సవాల్
Kishan Reddy

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వల్లనే తాను గట్టిగా రిప్లై ఇవ్వాల్సి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy G) అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. దేశం మీద భక్తితో జెండా మీద గౌరవంతో బీజేపీలో మాములు కార్యకర్తగా వచ్చి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న తనను పట్టుకొని తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తి అంటూ మాట్లాడటం రేవంత్ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.


ఇవాళ(మంగళవారం) ఏబీఎన్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే తాను ఎప్పుడు ఎక్కడ తెలంగాణకు అడ్డుపడ్డానో రుజువు చేయాలని సవాల్ విసిరారు. పదవుల కోసం పార్టీలు మారి కాళ్లు పట్టుకొనే వాడిని తాను కాదని తేల్చిచెప్పారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రేవంత్ చేతిలో ఉంది.. ఆయన ఎలాంటి విచారణ చేస్తారో చేసి తమకు అప్పగించాలని కిషన్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా: మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Raghu.jpg

సిద్దిపేట : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రాజీనామాకు రేవంత్ రెడ్డి సిద్ధమా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) మాస్ సవాల్ విసిరారు. పనిచేశా.. ఓటు వేయమంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను తన పాలనకు రెఫరెండంగా తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్‌తో రఘునందన్ రావు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో తమ ప్రభుత్వానికి వచ్చేది లేదు.. పోయేది లేదు అంటున్న కాంగ్రెస్ నేతలు ఎందుకు పోటీ చేస్తున్నారని నిలదీశారు.


ఈ కార్ రేస్ కేసులో నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏసీబీ రేవంత్ ప్రభుత్వం కంట్రోల్‌లో పని చేసేదే కదా అరెస్ట్ ఎందుకు చేయించడం లేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పొత్తు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఆధారమైనా చూపించాలని ఛాలెంజ్ చేశారు. పాత సీఎస్ సోమేష్ కుమార్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పిన వాళ్లు.. ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. రింగురోడ్డు టోల్ గేట్ కుంభకోణంలో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని రఘునందన్ రావు ప్రశ్నించారు.


కాంగ్రెస్‌లో బీసీని ఎందుకు సీఎం చేయలేదు..

అంతకుముందు సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్‌లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలుపును ఎవరు ఆపలేరని జోస్యం చెప్పారు. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్లమెంట్‌లలో కంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓట్లు సాధిస్తామని అన్నారు. గతంలో గెలిచిన నాయకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పంచన చేరారు, కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని మండిపడ్డారు. ఇతర పార్టీలో నాయకులను కొన్నట్లుగా బీజేపీ పార్టీ నాయకులను కొనలేరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉద్ఘాటించారు.


బీసీలలో ముస్లింలను రేవంత్ రెడ్డి కలిపారని ఆరోపించారు. నూటికి 55శాతం బీసీలు ఉంటే వారికి ఉన్న వాటా ప్రకారం మంత్రి పదవులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీని ఎందుకు సీఎం చేయలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. కేంద్రమంత్రి పదవుల్లో బీసీలకు మోదీ పెద్దపీట వేశారని చెప్పారు. ఒక్క మైనార్టీకి కూడా కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. తనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని చెప్పారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ముందుగా ధామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు నిర్ణయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది: ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి సభలో బీజేపీ గెలుస్తుందని చెప్పకనే చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14నెలల్లోనే ప్రజల విశ్వాసాలను కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తన కోసం మూడు రోజులు కష్టపడితే తాను ఆరేళ్లు మీ కోసం కష్టపడతా నిరుద్యోగులకు అండగా ఉంటానని మాటిచ్చారు. ఎమ్మెల్సీ జీతం నుంచి వచ్చే డబ్బులను పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ను ఆ దేశంతో పోల్చిన కేంద్రమంత్రి..

CM Revanth Reddy: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి..

Seethakka criticizes Bandi Sanjay: బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. సీతక్క మాస్ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 04:13 PM