Share News

Minister Seethakka: అధికారులు నిబద్ధతతో పనిచేయాలి.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 02:56 PM

MinisterSeethakka: మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని మంత్రి సీతక్క తెలిపాపారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాలన్నారు. అర్హులైన ప్రతి గర్భినీ, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించాలన్నారు. ఆ దిశలో జిల్లా సంక్షేమ అధికారులను సిద్ధo చేయాలని మంత్రి సీతక్క చెప్పారు.

Minister Seethakka: అధికారులు నిబద్ధతతో పనిచేయాలి.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
MinisterSeethakka

హైదరాబాద్: అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయాలని అన్నారు. అధికారుల మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఇవాళ(గురువారం) తెలంగాణ సచివాలయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని సూచించారు.


శాఖపరంగా వాస్తవాలనే నివేదించాలని అన్నారు. మంత్రుల మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దని చెప్పారు. అధికారులు, అమాత్యులు వేర్వురు కాదన్నారు. మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పారు. ఎవరూ తప్పులు చేయొద్దు, జైలు పాలు కావద్దని అన్నారు. మీ కింది ఉద్యోగులతో సంప్రదింపులు జరపండి, వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. రూ. 300 కోట్ల ఎన్ఆర్ఈజీఏ బిల్లులను నిన్న విడుదల చేశామని మంత్రి సీతక్క అన్నారు.


మల్టీ పర్పస్ వర్కర్ల వేతన బకాయిలను విడుదల చేశామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ తరహాలోనే ప్రతి విభాగంలో ఉద్యోగ సమస్యలను ఆన్‌లైన్‌లో పరిష్కరించే విధానాన్ని అవలంబించాలని అన్నారు. అర్హులైన ప్రతి గర్భిణి, బాలింత, చిన్నారికి పోషకాహారం అందించాలని అన్నారు. ఆ దిశలో జిల్లా సంక్షేమ అధికారులను సిద్ధo చేయాలని చెప్పారు. అంగన్వాడీ సేవలపై చిన్నారుల పేరెంట్స్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. ప్రతి నెలలో ఒకసారి ఫోన్ ఇన్ విత్ పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు అంగన్వాడీ సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంగన్వాడీకి వచ్చే గర్భిణులు కింద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులను తొలగించే విధంగా అంగన్వాడి కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగుల పరికరాల కోసం తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని డ్రైవ్‌ నిర్వహించి దివ్యాంగులకు పరికరాలను అందజేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Formula E Case: ఈడీ విచారణకు కేటీఆర్

Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..

Trains: దక్షిణమధ్యరైల్వే పరిధిలో 4 రైళ్ల దారి మళ్లింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 03:07 PM