Mastan Sai: మస్తాన్ సాయిని కస్టడీకి కోరిన పోలీసులు..
ABN , Publish Date - Feb 06 , 2025 | 11:46 AM
Mastan Sai: నగ్న వీడియోల కేసులో మస్తాన్ సాయిని కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ కేసులో లైతన దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మస్తాన్ సాయిని వారం రోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా మస్తాన్ సాయిని కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు. ఇందులో లోతైన దర్యాప్తు చేయాలని భావిస్తున్న పోలీసులు.. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. మరికొద్దిసేపట్లో కస్టడీ పిటిషన్‌ను సంబంధించి వాదనలు కొనసాగనున్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో వందలాది వీడియోస్‌ను గుర్తించిన పోలీసులు.. మొబైల్‌ను సీజ్ చేశారు. మస్తాన్ సాయి స్నేహితుడు కాజాను అరెస్ట్ చేసి 41 నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ టెస్ట్‌లోనూ మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మస్తాన్ సాయి మొబైల్‌లో వేలాదిమంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆరా పోలీసులు ఆరా తీయనున్నారు. నగ్న వీడియోలు, డ్రగ్స్ వ్యవహారంపై నార్సింగి పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా.. మస్తాన్ సాయి కొంతమంది యువతులను ట్రాప్ చేసి నగ్న వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ పాల్పడ్డాడని అభియోగాలు, ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ వ్యవహారం కూడా బయటపడింది. వీకెండ్స్‌లో తన ప్లాట్‌లో డ్రగ్స్ పార్టీలు చేసేవాడని.. దీనికి సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు సేకరించారు. డ్రగ్స్, నగ్న వీడియోలకు సంబంధించి పూర్తి స్థాయిలో నార్సింగ్ పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు కూడా తరలించారు.
అయితే జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించే క్రమంలో మస్తాన్ సాయికి కాజా అనే యువకుడికి డ్రగ్ టెస్ట్ చేయడంతో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్ కోణాలపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్, మొబైల్‌ను సీజ్ చేసిన పోలీసులు... వాటిని ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపించారు. వచ్చే వారంలో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోర్టుపై, వారంతరాల్లో డ్రగ్స్ పార్టీలపై మస్తాన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపే అవకాశం ఉంది. నార్సింగ్ పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి కోరినప్పటికీ కోర్టు ఎన్నిరోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది అనేది మరికాసేపట్లో తెలియనుంది.
ఇవి కూడా చదవండి...
CLP Meeting: సీఎల్పీ మీటింగ్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఆహ్వానం
Read Latest Telangana News And Telugu News