Share News

Anchor Shyamala: శ్యామలకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:08 PM

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామలపై పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌కు కేసు నమోదు అయింది. ఈ కేసులో సుమారు 11 మందిపై కేసులు నమోదు అయితే..వారందరిని పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. దీంతో శ్యామల సైతం విచారణకు హాజరుకావాల్సి ఉంది.

Anchor Shyamala: శ్యామలకు షాక్.. కోర్టు కీలక ఆదేశాలు..
Anchore Shyamala

హైదరాబాద్, మార్చి 21: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు ఊరట లభించింది. శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే నోటీసులు జారీ చేసి విచారణ కొనసాగించ వచ్చని పోలీసులకు సూచించింది. సోమవారం నుంచి విచారణలో భాగంగా పోలీసుల ఎదుట హాజరు కావాలని.. వారికి సహకరించాలని శ్యామలను ఆదేశించింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో యాంకర్ శ్యామలపై పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌కు కేసు నమోదు అయింది. ఈ కేసులో సుమారు 11 మందిపై కేసులు నమోదు అయితే..వారందరిని పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. దీంతో శ్యామల సైతం విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఈ విచారణకు యాంకర్ శ్యామల గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తనపై నమోదైన FIRను క్వాష్ చేయాలని శ్యామల ఆ పిటిషన్‌లో కోరారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. అనంతరం పైవిధంగా యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టు కీలక సూచన చేసింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్స్ చేసిన చాలా మంది ప్రముఖులను పోలీసులు విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే.


ఇంకోవైపు.. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 15 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 15 కేసులు నమోదయ్యాయి. దీంతో బెట్టింగ్‌లో చిక్కుకుని ఆత్మహత్యల కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగులపై ఆధారాలను సైతం పోలీసులు సేకరిస్తున్నారు. ఆత్మహత్యలకు కారణమైన బెట్టింగ్ యాప్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

కొత్తిమీర రసం తాగితే ఇన్ని లాభాలా..?

Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్

Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..

For Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 06:29 PM