IIT student suicide: ప్రయాగరాజ్‌లో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:01 AM
నిజామాబాద్ జిల్లా ఐఐఐటీ విద్యార్థి రాహుల్ చైతన్య ప్రైయాగ్‌రాజ్‌లో విద్యార్థి బ్యాక్‌లాగ్ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ప్రకటన ప్రకారం, ప్రత్యేక లెక్చరర్ల ద్వారా తరగతులు అందించకపోవడం కారణంగా ఈ ఘటన జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

హాస్టల్ భవనం పై నుంచి దూకిన రాహుల్ చైతన్య
నిజామాబాద్ అర్బన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐఐఐటీ విద్యార్థి ఎం.రాహుల్ చైతన్య(20) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని వర్ని మండలం సత్యనారాయణపురానికి చెందిన స్వర్ణలత-కృష్ణప్రసాద్ దంపతుల కుమారుడు రాహుల్ చైతన్య ప్రయాగ్‌రాజ్ ఐఐఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్కడి హాస్టల్‌భవనం ఐదవ అంతస్తు మీద నుంచి దూకి అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొదటి సంవత్సరంలో బ్యాక్‌లాగ్ ఉండటం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. మూగ, చెవిటి అయిన రాహుల్ జేఈఈ మెయిన్స్‌లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 52వ ర్యాంకు సాధించి గత ఆగస్టు నెలలో ఆ కళాశాలలో చేరాడు. చేరినప్పటి నుంచి తమకు ఫోన్ కూడా చేయలేదని తల్లిదండ్రులు తెలిపారు. బ్యాక్‌లాగ్ ఉండటం వల్ల ఆరు నెలలుగా చైతన్య కళాశాలకు వెళ్లడం లేదు. కళాశాలలో మూగ, చెవిటి వారికి ప్రత్యేక లెక్చరర్ల ద్వారా తరగతులు నిర్వహించాల్సి ఉన్నా.. అలాంటివి నిర్వహించకపోవడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాహుల్ తండ్రి సత్యనారాయణపురంలో చిన్న హోటల్ నిర్వహిస్తుండగా, తల్లి గృహిణి. చివరి సారిగా చనిపోయే ముందు రాహుల్ తల్లి స్వర్ణలతకు వీడియోకాల్ చేశాడు. ఆ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తాను చనిపోతున్నట్లు మెసేజ్ చేశాడు. తండ్రి, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని మెసేజ్ పెట్టినట్లు తల్లి తెలిపింది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News