Share News

India Post: గ్రామీణ డాక్‌ సేవక్‌ తొలి విడత ఫలితాల వెల్లడి

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:19 AM

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ఉద్యోగాల భర్తీకి తొలి విడత మెరిట్‌ లిస్ట్‌ను ఇండియా పోస్ట్‌ ప్రకటించింది.

India Post: గ్రామీణ డాక్‌ సేవక్‌ తొలి విడత ఫలితాల వెల్లడి

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ఉద్యోగాల భర్తీకి తొలి విడత మెరిట్‌ లిస్ట్‌ను ఇండియా పోస్ట్‌ ప్రకటించింది. తెలుగురాష్ట్రాలతో సహా దేశంలోని 22 రాష్ట్రాలకు సంబంధించిన ఈ మెరిట్‌ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 1,215, తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం వెల్లడించినది సిస్టమ్‌ జనరేటెడ్‌ షార్ట్‌ లిస్ట్‌. పదో తరగతిలో సాధించిన మార్కుల వివరాలను అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చేసిన అప్‌లోడ్‌ ఆధారంగా ఈ షార్ట్‌ లిస్ట్‌ జనరేట్‌ అయింది. ఖాళీలున్న డివిజన్‌ హెడ్‌ ఆఫీసులో అభ్యర్థుల డాక్యుమెంట్లను వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత తుది జాబితాను తయారు చేస్తారు.

Updated Date - Mar 23 , 2025 | 04:19 AM

News Hub