అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:04 PM
కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు.

- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యో తి) : కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. గురువా రం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.2500 నగదు, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు స్కూటీ వంటి హామీలు నేటికీ వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సర్వే చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరీ చేయకుండా కాలయాపన చేస్తోం దని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శ్రీనివాస్, కె.గీత, బి.ఆంజనేయులు, ఎం.ఆంజనేయులు, సభ్యులు ఎం.శ్రీనివాసులు, డి.ఈశ్వర్, శివవర్మ, రామ య్య, అశోక్, దశరథం, బాలస్వామి, లక్ష్మణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.