Gadwal: అప్పుచేసి ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:01 AM
అప్పు చేసి ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టిన ఓ యువకుడు వాటిలో నష్టపోయి వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది.

నష్టపోయి గద్వాలలో యువకుడి ఆత్మహత్య
ప్రేమ వ్యవహారం కూడా కారణమని అనుమానం
గద్వాల క్రైం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): అప్పు చేసి ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టిన ఓ యువకుడు వాటిలో నష్టపోయి వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది. గద్వాల పట్టణానికి చెందిన ఎన్. శివ (25) కొంతకాలంగా బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. వాటిలో నష్టాలు వచ్చినా.. అప్పు చేసి మరీ బెట్టింగ్ వేయడం కొనసాగించాడు. గతంలో శివ చేసిన అప్పులను అతని తండ్రి చెల్లించినట్లు తెలిసింది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమయిన నేపథ్యంలో శివ మళ్లీ బెట్టింగ్‌లు ఆడటం ప్రారంభించాడు.
ఈ క్రమంలో తనకు డబ్బులు దొరకకపోవడంతో తన స్నేహితులయిన ఇద్దరు వ్యక్తుల నుంచి అవసరముందని కార్లను తీసుకొని కుదువబెట్టి దాదాపు రూ. 5 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ డబ్బులను బెట్టింగ్‌లో పెట్టి నష్టపోవడంతోపాటు కార్లు ఇచ్చిన వ్యక్తులు ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక శనివారం తన ఇంట్లోని ఓ గదిలో ఫ్యానుకు ఉరేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. అయితే శివ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడని, ప్రేమ వివాదం కూడా మృతికి కారణమై ఉండొచ్చని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.