ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:03 PM
బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బీఆర్.అంబే డ్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు దళిత, ప్రజా సంఘా లు సహకరించాలని అదనపు కలెక్టర్ అమరేం దర్ కోరారు.

- అదనపు కలెక్టర్ అమరేందర్
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యో తి) : బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ బీఆర్.అంబే డ్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు దళిత, ప్రజా సంఘా లు సహకరించాలని అదనపు కలెక్టర్ అమరేం దర్ కోరారు. మహనీయుల జయంతి వేడుకల ను పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ అమ రేందర్ దళిత, ప్రజాసంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు దళిత ప్రజా సంఘాల నాయకులు ఉయంతి ఉత్సవ కమిటీని ఏ కగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 14న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జ యంతులను ప్రభుత్వం అధి కారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫో రం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు, సీనియర్ దళిత నాయకులు వార్డెన్‌చెన్నయ్య, ప్ర భాకర్, ఎంమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్య దర్శి కోళ్ల శివ, ఎంఎస్‌పీ జిల్లా కన్వీనర్ గూట విజయ్, మాదిగ జేఏసీ జిల్లా కన్వీనర్ వంగూరి జయశంకర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, బీఎంపీ జిల్లా కన్వీనర్ గడ్డం విజయ్, దళిత సంఘాల నాయకులు కళ్యాణ్, సంకి కురుమయ్య, నాగన్న, చంద్రస్వామి, జిలకర బాలస్వామి, మంతటి గోపి పాల్గొన్నారు.