ప్రయాణికులకు తప్పనున్న చిల్లర తిప్పలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:58 AM
ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు ప్రయాణికులకు ఇక నుంచి చిల్లర తిప్పలు తప్పనున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలను క్రమంగా అన్ని సర్వీసులకు విస్తరిస్తున్నారు. ఇప్పటి వరకు డీలక్స్ సర్వీస్ నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి స్లీపర్, లహరి ఏసీ స్లీపర్, గరుఢ సర్వీసుల్లో కొనసాగించిన ఈ-టిమ్‌లను ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లోనూ విస్తరిస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌కు 745 ఈ-టిమ్ యంత్రా లు వచ్చాయి. ఈ యంత్రాలు ఇప్పటి వరకు వినియో గిస్తున్న వాటి కంటే అధునాతనమైనవి పేర్కొన్నారు.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు ప్రయాణికులకు ఇక నుంచి చిల్లర తిప్పలు తప్పనున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలను క్రమంగా అన్ని సర్వీసులకు విస్తరిస్తున్నారు. ఇప్పటి వరకు డీలక్స్ సర్వీస్ నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి స్లీపర్, లహరి ఏసీ స్లీపర్, గరుఢ సర్వీసుల్లో కొనసాగించిన ఈ-టిమ్‌లను ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లోనూ విస్తరిస్తున్నారు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌కు 745 ఈ-టిమ్ యంత్రా లు వచ్చాయి. ఈ యంత్రాలు ఇప్పటి వరకు వినియో గిస్తున్న వాటి కంటే అధునాతనమైనవి పేర్కొన్నారు. పాత టిమ్‌ల స్థానంలో కొత్తగా వచ్చిన వాటిని ఐదు రోజుల నుంచి వినియోగిస్తున్నారు. రీజియన్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంథని ఆర్టీసీ డిపోలతో పాటు కరీంనగర్ 1, కరీంనగర్ 2, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల డిపోల్లో మంగళవారం నుంచి కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీస్ బస్సుల్లో ఈ-టిమ్ యంత్రాలను వినియోగిస్తు న్నారు.
ఫ తప్పనున్న చిల్లర తిప్పలు..
కరోనా ముందు నుంచే డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా నగదు రహిత సేవలు ఆరంభం కాగా, కరోనా అనంతరం వాటి సేవలు మరింత విస్తరించాయి. ఒకప్పుడు నగదు డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లి లైన్‌లో నిలబడి ఓచర్ రాసి డబ్బులు డ్రా చేసుకునే వాళ్లం. ఆ తర్వాత ఏటీఎం కార్డులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరగడంతో వాటిలోకి గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని తద్వారా నగదు రహిత లావాదేవీలను కొనసాగిస్తున్నారు. ప్రతీ ఒక్కరు నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడ్డారు. కూరగా యలు అమ్మే వారి నుంచి మొదలుకుని అన్ని రకాల వ్యాపారాలు చేసేవాళ్లు వినియోగదారుల కోసం నగదు రహిత సేవల కోసం స్కానర్లను వాడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లోని డీలక్స్ ఆపై సర్వీసుల్లో గతేడాది క్రితం నుంచే నగదు రహిత సేవలను వినియోగిస్తున్నారు.
ఫ మహాలక్ష్మి పథకంతో చిల్లర సమస్య..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు రాష్ట్రమంతటా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఈ పథకంతో ఆర్టీసీలో ఓఆర్ శాతం పెరిగింది. దీంతో బస్సుల సంఖ్య కూడా పెరిగింది. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో పురుషుల నుంచే మాత్రమే టిక్కెట్లు ఇచ్చి నగదు తీసుకోవాల్సి వస్తున్నది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. దీంతో కండ క్టర్లకు చిల్లర సమస్య తలెత్తింది. చాలా మంది వంద, 200, 500 రూపాయల నోట్లు తీసుక వస్తుండడంతో కండక్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. టిక్కెట్ వెనుకాల చిల్లర డబ్బులు రాస్తున్నారు. ప్రయాణికులకు కూడా అసౌకర్యంగా మారడాన్ని గమనించిన రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ ఉన్నతాధికారులు నగదు రహిత సేవలను ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈ-టిమ్‌లను ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని డిపోలకు సరఫరా చేశారు. కొత్త టిమ్‌ల ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని లగ్జరీ బస్సుల డ్రైవర్లు తెలిపారు. బస్సులో గల సీట్ల వరకు టిక్కెట్లు ఇచ్చిన తర్వాత అంతకు మించి అద నంగా ఒక్కరు ఎక్కినా కూడా టిక్కెట్ రావడం లేదని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో సీటింగ్ లాకింగ్ ఏర్పాటు చేయడం వల్ల సమస్య తలెత్తుతున్నదని చెబుతున్నారు. అలాగే పాత యంత్రాల్లో ఉన్నట్లుగా ఈ యంత్రాల్లో రాయితీ సేవలు, ఉచిత ప్రయాణ సేవలు అన్ని ఉన్నా యని చెబుతున్నారు. ఈ నెలాఖరుకల్లా అన్ని సర్వీ సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఫ క్రమంగా నగదు రహిత సేవల విస్తరణ..
- రాజు, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
ఆర్టీసీలోని అన్ని సర్వీసుల్లో నగదు రహిత సేవలను విస్తరిస్తున్నారు. కొత్తగా వచ్చిన ఈ-టిమ్‌లను ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసుల్లోనూ వినియోగిస్తాం. ప్రయో గాత్మకంగా కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వినియోగిస్తు న్నాం. తద్వారా సాంకేతిక ఇబ్బందులను గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళతాం. లగ్జరీ, ఇతర సర్వీసుల్లో కొత్త యంత్రాల్లో సీటు లాకింగ్ సిస్టం పై అధికారులు సవరించనున్నారు. ఈ-టిమ్‌ల వినియోగంపై కండక్లర్లకు అవగాహన కల్పిస్తాం.