Share News

ముగిసిన ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:35 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి చివరి రోజు బుధవారం నిర్వహించిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 12,521 మంది రెగ్యులర్‌గా పరీక్షలు రాయాల్సి ఉండగా 17 మంది గైర్హాజరు కాగా 12,504 మంది పరీక్ష రాశారు.

ముగిసిన ‘పది’ పరీక్షలు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి చివరి రోజు బుధవారం నిర్వహించిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 12,521 మంది రెగ్యులర్‌గా పరీక్షలు రాయాల్సి ఉండగా 17 మంది గైర్హాజరు కాగా 12,504 మంది పరీక్ష రాశారు. తొమ్మిది మంది ప్రైవేట్‌ విద్యార్థుల్లో ఐదు మంది పరీక్షలు రాయగా నలుగురు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాలను ప్రత్యేక అధికారుల బృందం, పరీక్షా విభాగం సహాయ కమిషనర్‌ ఐదు కేంద్రాలను, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్‌విఎస్‌ జనార్దన్‌రావు ఐదు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెవెన్యూ, విద్యుత్‌, ఆర్టీసీ, వైద్యశాఖల అధికారుల సహకారంతో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, దీంతో ఎక్కడ కూడా విద్యార్థులకు అసౌకర్యం కలగలేదని అన్నారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సహ విద్యార్థులకు వీడ్కోలు చెప్పి స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ విద్యార్థులు, వారి కుటుంబసభ్యులతో కిటకిటలాడింది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఎండదెబ్బ తగులకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉన్నత చదవులకు ఉజ్వల బాటలు వేసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

Updated Date - Apr 03 , 2025 | 12:35 AM