Share News

బిల్లులు లేకుండా వస్తువులు కొనవద్దు

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:33 AM

బిల్లులు లేకుండా ఏ వస్తువులు కొనరాదని న్యా య సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్‌ అన్నారు.

బిల్లులు లేకుండా వస్తువులు కొనవద్దు

సిరిసిల్ల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): బిల్లులు లేకుండా ఏ వస్తువులు కొనరాదని న్యా య సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధిక జైస్వాల్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణం లోని విద్యానగర్‌లోగల కమ్యూనిటీ భవనంలో అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సం దర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియో గదారులు నాణ్యత ప్రమాణాలు కలిగిన వస్తు వులను కొనుగోలు చేయాలన్నారు.ప్రతి వ్యాపార సంస్థలు ధరల పట్టికలు ప్రదర్శనగా పెట్టాల న్నారు. కల్తీ సరుకులు విక్రయిస్తే ఫిర్యాదు చేయాలన్నారు. వినియోగదారులు మోసాలకు గురైతే న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే చర్య లు తీసుకుంటామన్నారు. వినియోగదారుల చ ట్టాలు, హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవా లన్నారు. ఈ సదస్సులో లోక్‌ అదాలత్‌ సభ్యు లు చింతోజి భాస్కర్‌, న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:33 AM