ప్రశాంతంగా రెండోరోజు పదో తరగతి పరీక్ష..
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:19 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదోతరగతి పరీ క్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.

సిరిసిల్ల రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదోతరగతి పరీ క్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా లో విద్యార్థుల కోసం 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం జరిగిన పరీక్షకు 6767మంది విద్యార్థులకు 6750మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరుకాగా, 17మంది విద్యా ర్థులు గైర్హాజరయ్య్యారు.సిరిసిల్ల పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను శనివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేలు పరిశీలించారు. పట్టణంలోని శివ నగర్‌లోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సిద్థార్థ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలల్లోని పదో తరగతి పరీక్షల కేంద్రాలను సందర్శించి పరీ క్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరయ్యారనే వివరాలను విద్యశాఖ అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల క్ర్టానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలో పలికి అనుమతించవద్దని సూచించారు. పట్టణంలో ని శివనగర్ కుసుమ రామయ్య జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలతోపాటు గీతానగర్ బాలి క జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతుల పరీక్షలను ఎస్పీ మహేష్ బి గితే పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతా వరణంలో జరిగేలా చూడాలని పోలీస్ అధి కారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రావు, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.