Share News

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:49 PM

నేరస్థులకు శిక్షలు పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, దోషు లకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతగా వ్యహరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. శనివారం కమిషన రేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్‌ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది

కోల్‌సిటీ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): నేరస్థులకు శిక్షలు పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, దోషు లకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతగా వ్యహరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. శనివారం కమిషన రేట్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్‌ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ నేరస్థులకు శిక్షపడే విధంగా కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టి ట్రయల్‌ సజావుగా జరిగేలా చూడాల న్నారు. దోషులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని, నేరస్థులకు వారెంట్లు, సమన్లు సత్వరమే అందే విధంగా చూడాలన్నారు. ప్రాసిక్యూ షన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు. పీపీల సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్‌ కేసులు, వారెంట్లు, సమన్లు, సీసీటీఎన్‌ఎస్‌ డాటాలో ఎంట్రీ చేయాల న్నారు. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసు లపై నమ్మకం పెరుగుతుందన్నారు. న్యాయమూ ర్తులు, బాధితులు కోర్టు కానిస్టేబుళ్లను అభినందించే పరిస్థితి రావాలన్నారు.

కోర్టు కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలు

విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్దతతో పని చేస్తూ దోషులకు శిక్షలు పడేలా కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లకు సీపీ ప్రశంసాపత్రాలు అందించారు. హత్యాయత్నం, హత్య, చీటింగ్‌ కేసుల్లో శిక్షలు పడే విధంగా కృషి చేసిన వారికి లోక్‌ అదాలత్‌లో కేసు లలో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ(అడ్మిన్‌) రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మల్లారెడ్డి, లీగల్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, సీసీఆర్‌బీసీ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, సీసీ హరీష్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:49 PM