Share News

అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా బీసీ కులగణన

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:20 AM

బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయా లకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ కులగణను చేపట్టా రని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజవకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌ రెడ్డి అన్నారు.

అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా బీసీ కులగణన

సిరిసిల్ల టౌన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయా లకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ కులగణను చేపట్టా రని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజవకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం సిరిసిల్ల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేక రుల సమావేశంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను శాసనసభలో ఆమోదింపజేసి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించారన్నారు. గత ప్రభుత్వం ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టి, ఇప్పుడు బీసీ కులగణనలో తప్పులు జరగాయని సర్వేలో పాల్గొనని బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడడం వి డ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమో దించి చరిత్రలో నిలిచిందన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు వంగ మల్లేశంగౌడ్‌, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, మాజీ పీసీసీ కార్యదర్శి గడ్డం నర్స య్య, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారాయణ, వెంగళ లక్ష్మీనర్సయ్య, కత్తెర దేవదాస్‌, కుడికాల రవికుమార్‌, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ వైస్‌చైర్మన్‌ నీలి రవీందర్‌, కమలాకర్‌రావు, దేవయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:20 AM