Share News

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:54 PM

వడ గండ్ల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జూలపల్లి, వడుకాపూర్‌ గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను శనివారం ఆయన మండల వ్యవసాయ అదికారి, బిజేపి నాయకు లతో కలిసి పరిశీలించారు.

 పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

జూలపల్లి/ఎలిగేడు, మార్చి 22. (ఆంధ్రజ్యోతి) వడ గండ్ల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జూలపల్లి, వడుకాపూర్‌ గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను శనివారం ఆయన మండల వ్యవసాయ అదికారి, బిజేపి నాయకు లతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటలు చేతికందె సమయంలో ప్రకృతి వైపరిత్యంతో అపార నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు లను ఆదుకోవాలన్నారు నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్య మిస్తామన్నారు. ఏఓ ప్రత్యూష, పార్టీ మండల అధ్య క్షుడు కొప్పల మహేష్‌, నాయకులు సురేష్‌రెడ్డి, వేల్పుల ఓదెలు, ఐలయ్య, వేంసాని కొమురయ్య, దొడ్ల రాజయ్య, పలువురు రైతులు పాల్గోన్నారు.

ఎలిగేడు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలిం చారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతి కందే దశలో వర్షానికి కొట్టుకుపోయాయన్నారు. ర్యాకల్‌ దేవ్‌పల్లిలో మొక్కజొన్న, లాలపల్లి 25ఎకరాల మామిడి పంట దెబ్బతిన్నదని రైతులను ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. గొట్టెముక్కుల సురేష్‌రెడ్డి, గర్రెపల్లి నారా యణస్వామి, గాదె రంజిత్‌రెడ్డి, మల్లారపు అంజయ్య, రాయపాక మనోహర్‌, వేణుగోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:54 PM