రాజకీయాల్లో మార్పు యువతతోనే సాధ్యం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:47 PM
దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో మార్పు తెగలిగే శక్తి యువతలో ఉందని మంచిర్యాల జిల్లా ఆర్‌డీవో, సబ్ డివిజన్ మేజిస్ర్టేట్ గూడూరి శ్రీనివాసరావు అన్నారు. శనివారం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది.

కోల్‌సిటీటౌన్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో మార్పు తెగలిగే శక్తి యువతలో ఉందని మంచిర్యాల జిల్లా ఆర్‌డీవో, సబ్ డివిజన్ మేజిస్ర్టేట్ గూడూరి శ్రీనివాసరావు అన్నారు. శనివారం గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2025 కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లోనే అత్యధిక యువత దేశంలోనే ఉందన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్ధారించే శక్తి యువతరంపై ఉందన్నారు. అలాంటి శక్తియుక్తులను వెలికి తీయడంలో భాగంగా యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యువ పార్లమెంట్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని, మంచి నాయకుడు యువత నుంచే ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాన్ని నడిపించే సమర్ధవంతమైన నాయకుడు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇరుసులాంటి వారన్నారు. లక్ష్యసాధనలో గురువుల మార్గదర్శనం విజయాన్నిస్తుందన్నారు. అనంతరం వన్‌నేషన్, వన్ ఎలక్షన్, పేవింగ్ థీ వేఫర్ వికసిత్ భారత్‌పై విద్యార్థులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. యువ పార్లమెంట్ నోడల్ అధికారి ఎ.సాంబశివరావు, కళాశాల ప్రిన్సిపాల్ జైశంకర్ ఓజా, పెద్దపల్లి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనర్సయ్య, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ అనంతుల సతీష్‌కుమార్, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం.నరేష్, డాక్టర్. కిరణ్మయి, ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ బి.తిరుపతి, డాక్టర్ శారద, శంకరయ్య, అజయ్‌కుమార్, శ్రీదేవి, స్రవంతి, టీఎస్‌కేసీ మెంటార్ ఉష, రవీందర్, కిరణ్‌కుమార్, వాలంటీర్లు, ఎన్‌సీసీ కెడెట్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.