Share News

మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:35 AM

జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలిం చాలని, అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు.

మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి

సిరిసిల్ల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలిం చాలని, అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కో సమన్వ య సమావేశం జరిగింది. ఎస్పీ మహేష్‌ బీ గీతేతో కలిసి ఆయా శాఖల అధికారు లతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తం గా గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చూడా ల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, వీటికి అలవాటు పడితే ఆర్థి కంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు తప్పవని సూచించారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కలిగించేందుకు అవగాహన కార్యక్రమాలు సమర్థవంతం గా చేపట్టాలన్నారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం సంబంధించిన శాఖలు కలిసి పని చేయాలన్నారు. కళాశాలల్లో మత్తు పదార్థాల నిర్మూలన కమిటీలను కొనసాగిస్తూ విద్యార్థులు అన్ని రకాల మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. డ్రగ్స్‌ ఇతర మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, చర్చాగోష్టి పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ మహేష్‌ బి గీతే మాట్లా డుతూ అన్ని శాఖల సమన్వయంతో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్లు సమ్మయ్య, అన్వేష్‌, డీఎం హెచ్‌వో రజిత, ఇంటర్మీడియేట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, డీఏవో అప్జల్‌భేగం, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:35 AM