కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:29 AM
కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామ రక్షగా మారిందని, 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు ఒక్కరోజు కూడా సంతోషంగా లేరన్నారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వివరించా రు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశం లో జిల్లా అధ్యక్షుడు విద్యాపాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు లోక బాపు రెడ్డి తదితరులు ఉన్నారు.