Share News

ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:38 AM

సెర్ప్‌ కింద్ర నిర్ధేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తిచే యాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి డీఎన్‌ లోకేష్‌కుమార్‌ కోరారు.

ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : సెర్ప్‌ కింద్ర నిర్ధేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తిచే యాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి డీఎన్‌ లోకేష్‌కుమార్‌ కోరారు. సెర్ప్‌ కార్యక్రమాలపై సీఈవో దివ్యహైదరాబాద్‌ నుంచి గురువారం వీడియోకాన్ఫరె న్స్‌ నిర్వహించగా, కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్‌ సీజన్‌లో సెర్ప్‌ ద్వారా ఏర్పాటు చేయబో యే ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33 శాతం ఉన్న కొనుగోలు కేంద్రాలను 50శాతానికి పెంచేందుకు ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. జిల్లాలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాలు చేయ లేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపీలకు బదిలీ చేయాల ని, అదనపు ధాన్యం దిగుబడి నేపథఽ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వ శక్తి మహిళా సంఘాలతో ప్రా రంభించేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఐకేపీ కొ నుగోలు కేంద్రాలకు అవసర మైన తేమ, వేయింగ్‌ యం త్రాలతోపాటు ప్యాడీ క్లీనర్‌లు ఇతర సామగ్రిని అందించాల ని సూచించారు. నూతనంగా ఏర్పాటుచేసే కొనుగోలు కేం ద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్ష ణను అందించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్ర మంలో భాగంగా ప్రతి మండలంతో గోదాముల నిర్మా ణాలకు సంకల్పించారని, గోదాములు లేని మండలాల ను గుర్తించి మహిళా సంఘాల ద్వారా గోదాంలను ని ర్మించేందుకు స్థలాలను పరిశీలించాలని సూచించారు. స్వశక్తి మహిళా సంఘాల ద్వారా స్వీచ్చింగ్‌ సెంటర్‌లు పూర్తి స్ధాయిలో వినియోగించుకునేలా ప్రణాళికలను తయారుచేయాలని కోరారు. డీఅర్‌డీవో శేషాద్రి, మెడి కల్‌ సూపరిండెంట్‌ లక్ష్మీనారాయణ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ రజిత, డీసీఎస్‌వో వసంత లక్ష్మీ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మల్లిఖార్జున్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:38 AM