మరమగ్గాల కార్మికుల మానవహారం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:47 AM
సిరిసిల్లలో మరమగ్గాలతో పాటు అనుబంధ రంగాల కార్మికుల కూలి నిర్ణయించి, సమస్యలను పరి ష్కరించాలంటూ సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులగా నిరవధిక సమ్మెను చేపడుతున్నా రు.

సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో మరమగ్గాలతో పాటు అనుబంధ రంగాల కార్మికుల కూలి నిర్ణయించి, సమస్యలను పరి ష్కరించాలంటూ సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులగా నిరవధిక సమ్మెను చేపడుతున్నా రు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని బీవైనగర్ అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్మికులు భారీ ర్యాలీగా తరలివచ్చి మానవహారం చేపట్టి నిరసనలు తెలిపారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ పవర్‌లూంవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, సీఐటీయూ జిల్లా అఽధ్య క్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్ దాస్ గణేష్, సిరిమల్ల సత్యం, కుమ్మరి కుంట కిషన్, ఉడుత రవి, నక్క దేవదాస్, ఎలిగేటి శ్రీనివాస్, ఒగ్గు గణేష్, జగదీ్‌ష్, గుండు రమేష్, బేజుగం సురేష్, భాస శ్రీధర్, మచ్చవేణు, సబ్బని చంద్రకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.