ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:43 AM
చందుర్తి మండలంలో ఉపాధిహా మీ ద్వారా చేపట్టిన పనులపై గురువా రం మండల పరిషత్ కార్యాలయం లో ఆవరణలో సామాజిక తనిఖీ ప్ర జావేదికను నిర్వహించారు.

చందుర్తి, మార్చి 27 (ఆంధ్రజ్యో తి): చందుర్తి మండలంలో ఉపాధిహా మీ ద్వారా చేపట్టిన పనులపై గురువా రం మండల పరిషత్ కార్యాలయం లో ఆవరణలో సామాజిక తనిఖీ ప్ర జావేదికను నిర్వహించారు. 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు రూ.3కోట్ల77 లక్షల 30 వేల ఖర్చుతో వివిధ రకాల పనులు చేసినట్లు అధి కారుల వెల్లడించారు. డీఆర్‌పీలు మా ట్లాడుతూ పలు గ్రామాల్లో కార్యదర్శు ల సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారన్నారు. ఎన్గల్ గ్రామంలో భార్య భర్తలకు వేర్వేరుగా ఇద్దరికి జాబ్ కార్డులు ఇచ్చారన్నారు. ఒకరి పేరు మీద జాబ్ కార్డు రద్దు చేయాలని సూచించారు. ఉపాధి పనుల్లో కొలత లు సక్రమంగా చేయలేదన్నారు. మస్ట ర్లలో కూలీల సంతకాలు, రికార్డులు సక్రమంగా నిర్వహణ లేదని ఈజీఎస్ సిబ్బందికి రూ.55,392 రికవరీ, రూ. 11,000 పెనాల్టీ వేశారు. డీఆర్‌డీవో బి.శేషాద్రి మాట్లాడుతూ గ్రామపంచా యతీలో చేపట్టిన పనుల్లో అవకతవక లకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్‌రెడ్డి, అంబుడ్స్‌మెన్ రా కేష్, ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, ఏపీవో రాజయ్య, టీఏలు, గ్రామకార్యదర్శులు, ఎఫ్‌ఏలు, ఎస్‌ఆర్‌పీలు, కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.