Share News

ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ దేశానికే ఆదర్శం

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:08 AM

ఎస్సీ వర్గీకరణకు అసెం బ్లీలో చట్టబద్దత కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించి దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారిచూపిన ఘనత కాంగ్రెస్‌ దేన న్నారు.

ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్‌ దేశానికే ఆదర్శం

పెద్దపల్లిటౌన్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) ఎస్సీ వర్గీకరణకు అసెం బ్లీలో చట్టబద్దత కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించి దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారిచూపిన ఘనత కాంగ్రెస్‌ దేన న్నారు. అందరినీ సమన్వయం చేస్తూ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు. 95 ఏళ్ళ తర్వాత తెలంగాణలో బీసీ కులగణన నిర్వహించడం చారిత్రా త్మకమన్నారు. బీసీ బిల్లును కేంద్రానికి పంపి పార్లమెంటులో చట్ట బద్దత పొందేవరకు పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ పోరాడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చా రని ఎద్దేవా చేశారు. యువ వికాసం ద్వారా అర్హులైన యువతకు సబ్సిడీపై రుణాలు అందజేస్తామని తెలిపారు. పారదర్శకంగా పాలన చేస్తూ అభివృద్ది, సంక్షేమం సాధిస్తుంటే బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కళ్ళు, చెవులు లేని వాడిలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేందుకు కాల్వల వెంట తిరు గుతున్నామని తెలిపారు. మార్కెట్‌ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్‌ రావు, తిరుపతి రెడ్డి, నాయకులు గోపగాని సారయ్య గౌడ్‌, మస్రత్‌, సురేష్‌ గౌడ్‌, సందనవేన రాజేందర్‌, బండారి సునీల్‌, ఆరె సంతోష్‌, , దొడ్డుపల్లి జగదీష్‌, జాని, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:08 AM