Pillow Covers: పిల్లో కవర్స్ ఎప్పుడు ఛేంజ్ చేస్తున్నారు.. ఎన్ని రోజుల తర్వాత మార్చాలో తెలుసా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:36 PM
Pillow Covers: దిండు కవర్లు మార్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇన్ని రోజుల కంటే ఎక్కువ రోజులు వాడితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. కాబట్టి, జాగ్రత్త..

Pillow Covers: రోజులో దాదాపు 8 గంటల పాటు మెత్తని బెడ్ షీట్లు, దిండ్లపై హాయిగా సేదతీరతాం. అలసిన శరీరానికి హాయినిచ్చే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండకపోతే ఎంత ప్రమాదమో తెలుసా. పక్కపై పడుకుని నిద్రపోయేటప్పుడు మన శరీరంపై ఉండే మృతకణాలు చేరేది వీటిపైనే. రోజులు గడిచే కొద్దీ కోట్లకొద్దీ బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు మన బెడ్ పై తిష్ట వేస్తాయి. మురికిగా కనిపించలేదు కదా అని అలానే వాడుతూ పోతే లేనిపోని చర్మ అలర్జీలు, దురద, మొటిమలు, శ్వాస సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని సమస్యలో మిమ్మల్ని ఆవహిస్తాయి. అందుకే ఇన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా బెడ్ షీట్లు, దిండు కవర్లు మార్చి తీరాల్సిందే..
ప్రతిరోజూ ఉపయోగించే బెడ్ షీట్లు, దిండు కవర్లు ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నష్టపోయేది ఆరోగ్యాన్ని అనే సంగతి గుర్తుంచుకోండి. పైకి మురికి కనిపించడం లేదని భావించి ఊరుకుంటే వాటిపై ఉండే బ్యాకీరియాకు ఆరోగ్యాన్ని బలి చేయాల్సిందే.
మురికిగా ఉన్న దిండు కవర్ ఎందుకు ప్రమాదకరం?
దిండు కవర్, దుప్పట్లు పైకి శుభ్రంగానే కనిపించవచ్చు. కానీ రోజులు గడిచేకొద్దీ వివిధ రకాల బ్యాక్టీరియా, చనిపోయిన చర్మ కణాలు, దుమ్ము, చెమట వాటిపై పేరుకుపోతూ ఉంటాయి. మీరు ప్రతిరోజూ పడుకునే ముందు తప్పకుండా దులిపి పడుకోవాలి. లేకపోతే ఈ కింది సమస్యలు భరించక తప్పదు. కాబట్టి జాగ్రత్త.
మురికిగా ఉండే దిండు కవర్లు మొటిమలు, దద్దుర్లు, తదితర చర్మ సమస్యలు రావడానికి కారణమవుతాయి.
దిండ్లపై పేరుకుపోయే దుమ్ము, బ్యాక్టీరియా జుట్టు రాలడానికి కారణమవుతాయి. చుండ్రు సమస్యను పెంచుతాయి.
దిండు కవర్లపైన ఉండే దుమ్ము, బ్యాక్టీరియా వల్ల దగ్గు, ఉబ్బసం కలిగిస్తాయి. దీర్ఘకాలం శ్వాస సమస్యలు అలెర్జీలు వేధించినా ఆశ్చర్యం లేదు.
దిండు కవర్‌ను ఎన్ని రోజులకోసారి మార్చాలి?
దిండు కవర్‌ను ప్రతి 2-3 రోజులకు ఒకసారి మార్చాలి (How often to change pillow Covers). చర్మ అలెర్జీలు, మొటిమలు లేదా శ్వాస సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజూ మార్చుకోవాలి. బాగా ఉతికి ఆరబెట్టిన దిండు కవర్లనే ఉపయోగించాలి.
దిండు కవర్లను ఎలా శుభ్రం చేయాలి?
వేడి నీరు: బ్యాక్టీరియా, ధూళిని వదలగొట్టడానికి దిండు కవర్‌ను వేడి నీటిలో నానబెట్టి ఉతకడం చాలా మంచిది.
తేలికపాటి డిటర్జెంట్: కఠినమైన రసాయనాలు కలిగిన డిటర్జెంట్‌లు చర్మానికి హానికరం. కాబట్టి తేలికపాటి డిటర్జెంట్ వాడండి.
ఎండలో ఆరబెట్టడం: దిండు కవర్‌ను ఎండలో ఆరబెట్టడం వల్ల దానిలోని బ్యాక్టీరియా, ఫంగస్ నశిస్తాయి.
సిల్క్ లేదా కాటన్ కవర్లు: కాటన్, సిల్క్ వంటి సహజ వస్త్రాలు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తాయి. చర్మానికి కూడా మేలు చేస్తాయి.
Read Also : Rat Control: ఎలుకల బాధతో విసిగిపోయారా.. ఇలా చేస్తే చంపకుండానే ఇంట్లో నుంచి మాయమవుతాయి..
Relaxation tips: ఎంత ఒత్తిడిలో ఉన్నా ఈ టిప్స్‌తో ఈజీగా రిలాక్స్ అయిపోవచ్చు
Health Benefits: ఓ గిన్నె పెరుగు తీసుకుంటే చాలు..ఈ వ్యాధులు మటుమాయం..