Share News

బస్‌ డ్రైవర్ల కృషి అభినందనీయం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:43 AM

ప్రయాణికులను గమ్యానికి సురక్షితంగా చేర్చడంలో డ్రైవర్ల కృషి అభినందనీయమని ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావు అన్నారు.

బస్‌ డ్రైవర్ల కృషి అభినందనీయం

సిరిసిల్ల టౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ప్రయాణికులను గమ్యానికి సురక్షితంగా చేర్చడంలో డ్రైవర్ల కృషి అభినందనీయమని ఆర్టీసీ సిరిసిల్ల డిపో మేనేజర్‌ ప్రకాష్‌రావు అన్నారు. సోమవారం డిపోలో కెఎస్‌ రెడ్డి, బీ రఘపతి, డి రాజేశ్వర్‌ డ్రైవర్లుగా ఎన్నో సంవత్సరాలు విధులు నిర్వహించి పదవీ విరమణ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికా రు. ఈసందర్భంగా ప్రకాష్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీలో దాదాపు మూడు దశాబ్ధాలుగా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చడంలో డ్రైవర్ల సేవలను వెలకట్టలేమన్నారు. ముగ్గురు డ్రైవర్లు విధి నిర్వహణలో అంకితభావంతో పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ హెడ్‌కాని స్టేబుల్‌ రాజేందర్‌రెడ్డి, అఫీసు సూపరింటెండెంట్‌ నక్క శ్రీనివాస్‌, ఇంచార్జి ట్రాఫిక్‌ అధికారి వర్ధిలాల్‌, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్స్‌ బాపిరెడ్డి, సత్యం, రామ్‌ రెడ్డి, ఎంబీ కిషన్‌, డిపో సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:43 AM