Share News

CM Revanth Reddy: తక్కువ వడ్డీకి రుణాలివ్వండి!

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:59 AM

గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిఽధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నాబార్డు చైర్మన్‌ కేవీ షాజీని కోరారు. సూక్ష్మ నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy: తక్కువ వడ్డీకి రుణాలివ్వండి!

  • ఆర్‌ఐడీఎఫ్‌ కింద మంజూరు చేయండి

  • సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి

  • కొత్తగా పీఏసీఎ్‌సలను ఏర్పాటు చేయండి

  • నాబార్డు చైర్మన్‌ను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిఽధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నాబార్డు చైర్మన్‌ కేవీ షాజీని కోరారు. సూక్ష్మ నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారమిక్కడ సీఎం రేవంత్‌రెడ్డితో షాజీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సహకార సంఘాలను బలోపేతం చేయాలని, కొత్తగా మరికొన్ని ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎ్‌స)ను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రత్యేక పథకానికి రూపకల్పన చేయాలన్నారు. ఐకేపీ, గోదాములు, రైస్‌ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి.. రాష్ట్రంలో మిల్లింగ్‌ సామర్థ్యం పెంచేందుకు సహకరించాలని సీఎం కోరారు.


ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు పథకాల నిధులు మార్చి 31లోగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా నాబార్డు పథకాలను ఉపయోగించుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అందించే సోలార్‌ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని రేవంత్‌ సూచించారు. కొత్త పంచాయతీలకు అనుసంధానం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలను ఏర్పాటు చేయాలని సీఎంని షాజీ కోరారు. వ్యవసాయ, నీటిపారుదల, తాగునీటి సరఫరా, పాడిపరిశ్రమ అభివృద్ధి, ఆయిల్‌పామ్‌, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఉన్నత విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పశువైద్య కళాశాలల, పంట ఉత్పత్తుల సేకరణకు నాబార్డు సాయం చేస్తోందని షాజీ వెల్లడించారు.

Updated Date - Mar 22 , 2025 | 04:59 AM