Share News

Home Minister: మైనర్ల జోలికొస్తే రౌడీషీట్‌

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:13 AM

అటువంటి వారిపై ఉక్కుపాదం మోపండి’ అని పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం హోంమంత్రి సమీక్షించారు.

Home Minister: మైనర్ల జోలికొస్తే రౌడీషీట్‌

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ‘మైనర్లపై ఎవరు నేరాలకు పాల్పడినా రౌడీషీట్‌ ఓపెన్‌ చేయండి. ఇటీవల గన్నవరంలో మైనర్‌పై రేప్‌ కేసులో 8మంది నిందితుల్లో ఐదుగురు రౌడీషీటర్లున్నారు. అటువంటి వారిపై ఉక్కుపాదం మోపండి’ అని పోలీసులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం హోంమంత్రి సమీక్షించారు. మహిళలపై నేరాల తీరుతెన్నులు, కట్టడిపై జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. మహిళలపై నేరాల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. సైబర్‌ నేరాల కట్టడికి అధునాతన టూల్స్‌ పయోగిస్తే.. ఈ సమస్యకు ఏపీ పోలీసు శాఖ నుంచే మెరుగైన పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. శాంతిభద్రతల ఏడీజీ మధుసూధన్‌ రెడ్డితోపాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:13 AM