Share News

KP Vivekanand: బీజేపీ, కాంగ్రెస్‌ది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:47 AM

ఢిల్లీలో కుస్తీ అంటున్న బీజేపీ, కాంగ్రె్‌సలు గల్లీలో దోస్తీ అయ్యాయి’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ ఆరోపించారు.

KP Vivekanand: బీజేపీ, కాంగ్రెస్‌ది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ పార్టీ రాసిచ్చిన స్ర్కిప్ట్‌ ప్రకారం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో కుస్తీ అంటున్న బీజేపీ, కాంగ్రె్‌సలు గల్లీలో దోస్తీ అయ్యాయి’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీల మైత్రీ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు. రేవంత్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు డీలింగ్‌ పెట్టుకొని బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు జాతీయ పార్టీలు బాహాటంగానే ఒప్పందం చేసుకొని ప్రభుత్వం ఇరకాటంలో పడినప్పుడు బీజేపీ ద్వారా బీఆర్‌ఎ్‌సపై మాటలదాడి చేయిస్తున్నారని చెప్పారు. కాషాయ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ భాష మాట్లాడేకన్నా ఆ పార్టీలో విలీనమైతే మంచిదని ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 28 , 2025 | 03:47 AM