ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:40 AM
ప్రజావాణి లో వచ్చే అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దని ప్రజా భవన్ నోడ ల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి లో వచ్చే అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దని ప్రజా భవన్ నోడ ల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. ప్రజా భవన్ ప్రజావాణి దరఖాస్తులు, ఎన్‌బీఎఫ్‌ఎస్ తదితర అంశా లపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా భవన్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచిం చారు. దరఖాస్తుదారులు ఒకే అర్జీని పట్టుకొని పదే పదే రాకుండా చూడాలని ఆదేశించారు. అర్హులైన వారి సమస్యలు తప్పకుండా పరిష్కా రం కావాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎన్‌బీఎఫ్‌ఎస్‌పై ప్రచారం చేయాలని, అర్హులం దరికీ సహాయం అందేలా చూడాలని తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికా రులు పాల్గొన్నారు.