Share News

Jadcherla: 403 గజాలకు రూ. 20.50 కోట్లు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:16 AM

ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) చార్జీలు కోట్లలో రావడంతో సదరు ప్లాటు యజమాని కంగుతిన్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Jadcherla: 403 గజాలకు రూ. 20.50 కోట్లు

  • ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జి చూసి కంగుతిన్న యజమాని

  • మరో 400 గజాలకు రూ. 20.34 కోట్లు

  • 25 శాతం రిబేట్‌ తీసేసిన తర్వాతే

  • జడ్చర్ల మునిసిపాలిటీలో ఘటన

జడ్చర్ల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) చార్జీలు కోట్లలో రావడంతో సదరు ప్లాటు యజమాని కంగుతిన్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మునిసిపాలిటీలోని సర్వే నెంబరు 108లోని 400 గజాల స్థలానికి 25 శాతం రిబేటుతో రూ.20,34,29,503 రెగ్యులరైజేషన్‌ చార్జీలు చెల్లించాలంటూ ఫీ ఇంటిమేషన్‌ లెటర్‌లో పొందుపరిచారు. అలాగే అదే సర్వే నెంబరులోని మరో 403 గజాల స్థలానికి చెందిన మరో ప్లాటుకు సంబంధించి 25 శాతం రిబేటుతో రూ. 20,50,06,090 రెగ్యులరైజేషన్‌ చార్జీలు చెల్లించాలంటూ ఇంటిమేషన్‌ లెటర్‌ను జారీ చేశారు.


సాంకేతిక సమస్యనా లేక మరే ఇతర కారణమా అనేది తెలియక యజమాని ఆందోళనకు గురయ్యారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్యతో ఉంటుందన్నారు. మునిసిపాలిటీ కార్యాలయానికి ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పేపర్‌లు తీసుకువచ్చి సంప్రదిస్తే రివైజ్‌ చేయిస్తామన్నారు. నిజానికి తమ 200 గజాల రెండు ప్లాట్‌లను ఇంటిమేషన్‌ లెట్‌ర్‌లో 400 గజాల రెండు ప్లాట్‌లుగా అధికారులు తప్పుగా చూపారని యజమాని వాపోయారు.

Updated Date - Mar 27 , 2025 | 04:16 AM