Share News

న్యాయవాదుల విధులు బహిష్కరణ

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:23 PM

లక్షెట్టిపేట న్యాయస్థానంలో న్యా యవాదులు మంగళవారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు.

న్యాయవాదుల విధులు బహిష్కరణ
విధులు బహిష్కరించిన న్యాయవాదులు

లక్షెట్టిపేట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట న్యాయస్థానంలో న్యా యవాదులు మంగళవారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్‌ కుమార్‌ మా ట్లాడుతూ న్యాయవాదులపై దాడులు అధిక మవుతున్నాయని హైదరాబా ద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ ఎర్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులను ఖటినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసారు. ఈకా ర్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, కారుకూరి సురేం దర్‌, భూంరెడ్డి, సత్తన్న, సత్యనారాయణ, శ్రీధర్‌, గోవింద్‌రావుతో పాటు న్యాయవాదులు ప్రదీప్‌కు మార్‌, రాజేశ్వర్‌, ప్రకాశం ఉన్నారు.

గర్మిళ్ల: మంచిర్యాల పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. హై దరాబాద్‌లోని చెంబాపేట లో అడ్వకేట్‌ను హత్య చేసిన వ్యక్తులను శిక్షిం చాలన్నారు. మంచిర్యాల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టును బహి ష్కరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బార్‌ అ సోసియేషన్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అనిల్‌రాజు, స్వామి, జగన్‌, మురళి, రవి, రంగు మల్లేశ్‌, తులా ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 11:23 PM