విద్యారంగంలో అగ్రగామిగా నిలుపుదాం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:37 PM
విద్యారంగంలో జిల్లాను దేశంలో నే అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వ హిస్తున్న తెలంగాణ క్షేత్రాలు, అక్షరదర్శ నం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

మంచిర్యాల క్రైం, మార్చి22 (ఆంధ్ర జ్యోతి): విద్యారంగంలో జిల్లాను దేశంలో నే అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్ట ణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వ హిస్తున్న తెలంగాణ క్షేత్రాలు, అక్షరదర్శ నం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యా ల 30 ఏళ్లలో వెనుకబడి ఉందన్నారు. మం చిర్యాలను విద్యా, సాంకేతిక రంగాల్లో దేశం లోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఆ యనతో పాటు తాజా మాజీ ప్రజాప్రతి ని ధులు, ప్రిన్సిపాల్ చక్రపాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ముస్లింలకు తోఫా కిట్ల పంపిణీ
లక్షెట్టిపేట: రంజాన్ పండుగను కుటుం బ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నా రు. రంజాన్ పండగ సందర్భంగా కొక్కిరాల రఘుపతి రావు చారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సు రేఖతో కలిసి తోఫాకిట్ల పంపిణీ కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మార్కెట్ కమిటీవైస్ చైర్మన్ ఆరీ ఫ్, పార్టీ మండల అధ్యక్షుడు పిం గిళి రమేష్, ట్రాన్స్‌పోర్టు మెంబర్ అంకతి శ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపా ధ్యక్షుడు చింత అశోక్, మాజీ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్న వెంకటేష్ పాల్గొన్నారు.
దండేపల్లి: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం సేవ చేయాలనే త పనతో కొక్కిరాల రఘపతిరావు చారిటబు ల్ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా మండలంలోని ముస్లిం మహిళలకు రంజా న్‌కా తోఫా కిట్‌లను డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి అందజేశారు. కార్యక్రమం లో రాజీవ్‌గాంధీ పంచాయతీ రాజ్ సంఘ టన్ జిల్లా అధ్యక్షులు త్రిమూర్తి, లక్షెట్టి పేట మార్కెట్ కమిటీచైర్మన్ దాసరి ప్రేమ్ చందు, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్ ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.