ఎల్‌ఆర్‌ఎస్ కష్టాలు...!
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:28 PM
అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని రేవం త్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించడంతో ఆనందోత్సాహాల్లో మునిగితేలిన వినియోగదారులు ప్రస్తుతం అష్టకష్టా లు పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం విదివిధానా లు రూపొందించిన ప్రభుత్వం సంబంధిత వెబ్‌సై ట్‌లో సమస్యలు నివారించకపోవడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది.

-వెబ్‌సైట్‌లో అనేక సమస్యలు
-ఆన్‌లైన్‌లో కానరాని గత చెల్లింపుల వివరాలు
-25 శాతం రాయితీకి సమీపిస్తున్న గడువు
-మళ్లీ కొత్తగా ఫీజు చెల్లించక తప్పని పరిస్థితులు
-కార్యాలయాల చుట్టూ వినియోగదారుల ప్రదక్షిణలు
మంచిర్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని రేవం త్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించడంతో ఆనందోత్సాహాల్లో మునిగితేలిన వినియోగదారులు ప్రస్తుతం అష్టకష్టా లు పడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం విదివిధానా లు రూపొందించిన ప్రభుత్వం సంబంధిత వెబ్‌సై ట్‌లో సమస్యలు నివారించకపోవడంతో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థి తులు నెలకొన్నాయి. 2020 చట్టం ప్రకారం.. నిబం ధనలను అనుసరించి ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమ తినివ్వగా గత నెల 20న జీవో నెంబరు 28ని కూడా విడుదల చేసింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఆనందం వెల్లివిరియగా, నాలుగేళ్ల అనంతరం ఇక రిజిస్ట్రేషన్లు అవుతాయనే భావనలో ఉన్నారు. తీరా వెబ్‌సైట్‌లో నెలకొన్న సమస్యల కారణంగా రిజిస్ట్రేష న్లు నిలిచిపోవడంతో వారంతా నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో అక్రమ లే అవుట్లు, రిజిస్ట్రేష న్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సె ప్టెంబర్ 1న అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసిం ది. ఇందులో భాగంగా 26 ఆగస్టు 2020 లోపు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లే అవుట్ యజమాను లు, ప్లాట్ల ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిం చింది. అందులోని లే అవుట్ నిబంధనలను సవరి స్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎల్‌ఆర్‌ఎస్ సైట్‌లో సమస్యలతో జాప్యం....
సవరణలతో ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించిన ప్రభు త్వం...దానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ వెబ్‌సైట్‌లో నెలకొన్న సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకం ఎదురవుతోం ది. గత ప్రభుత్వ హయాంలో ఎల్‌ఆర్‌ఎస్-2020 ప్ర వేశపెట్టినప్పుడు చాలా మంది వినియోగదారులు ని ర్ణీత ఫీజు చెల్లించారు. ఒక్క ప్లాట్ అయితే రూ. వె య్యి, వెంచర్ అయితే రూ. 10వేల చొప్పున ఫీజు ని ర్ణయించగా రిజస్ట్రేషన్లకు ఆసక్తిగల వినియోగదారు లు పెద్ద సంఖ్యలో అప్పట్లో చెల్లించారు. ఒక్క మం చిర్యాల మున్సిపల్ కార్పోరేషన్‌కు సంబంధించినవే వేలల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు నాలుగేళ్లు గడిచిన తరువాత మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ తెర పైకి రావడంతో తాము చెల్లించిన ఫీజు తిరిగి విని యోగంలోకి వస్తుందని రియల్టర్లు, వినియోగ దారు లు సంతోషించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌లో నెలకొన్న సమస్యల కారణంగా గతంలో చెల్లించిన ఫీ జులు ఏవీ కూడా కానరాకపోవడంతో సబ్ రిజిస్ట్రా ర్‌లు సంబంధిత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అం గీకరించడం లేదు. దీంతో గతంలో చెల్లించిన ఫీ జు లన్నీ వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అ త్యవసరం ఉన్న వారు మళ్లీ ఫీజులు చెల్లించి రిజి స్ట్రేషన్లు చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇ దిలా ఉండగా కొత్తగా ఆన్‌లైన్‌లో చెల్లించిన ఫీజు కూడా సైట్‌లో చూపించకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్ర క్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో మంచి ర్యాల, లక్షెట్టిపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో నిత్యం సగటున నాలుగైదు డాక్యు మెంట్లు కూడా కాకపోవడమే దీనికి నిదర్శనం. అవి కూడా డాక్యుమెంట్ నుంచి డాక్యుమెంట్‌కే తప్ప.... వెంచర్లలోని.. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. మ రోవైపు దరఖాస్తుల్లో నదులు, వాగుల బఫర్ జోన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా సకాలంలో పూర్తికాక రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ ప్ర వేశపెట్టడం ద్వారా జమ అయ్యే ఫీజులతో రాష్ట్ర ఖజానా నింపుకోవాలని భావించిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
సమీపిస్తున్న రాయితీ గడువు....
ఎల్‌ఆర్‌ఎస్‌కు విదివిధానాలు రూపొందించిన ప్ర భుత్వం మార్చి 31లోపు నిర్ణీత క్రమబద్ధీకరణ చార్జీ లు, ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించిన పక్షంలో సంబంధిత ఫీజుల్లో వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ. 25 శాతం రాయి ఇవ్వనున్నట్లు ప్రకటిం చింది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు పెద్ద మొత్తం లో ఆదా అవుతుండటంతో గడువులోపు దరఖాస్తు చేసేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారుల సబ్ రి జిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యల కా రణంగా రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగకపోగా ఈ నెల 31తో రాయితీ గడువు ముగుస్తుంది. దీంతో ప్ర భుత్వం ప్రకటించిన మేరకు రాయితీ పొందే అవకా శం వినియోగదారులు కోల్పోయే అవకాశం ఉంది. ఇ దిలా ఉండగా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు ఈ నెల 31తోనే ముగు స్తుందని, గడువు పెంచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పా రు. ఓ వైపు గడువు సమీపిస్తుండటం, మరోవైపు రి జిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో విని యోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెబ్‌సైట్‌లో నెలకొన్న సమ స్య లను తక్షణమే పరిష్కరించడం ద్వారా రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.