ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:34 PM
ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు.

- హామీల అమలులో ఘోరంగా విఫలం
- మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
మద్దూర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మద్దూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నడు లేని విధంగా వర్షం పడినా కూడా శ్రీశైలంలో నీరు లేకపోవడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే కారణమని, నీటినంతా ఆంధ్ర రాష్ట్రానికి తర లించి తమ గురువైన చంద్రబాబుకు దక్షిణగా అందించారని ఆరోపించారు. నియోజకవర్గంలో తాగునీరు కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు తరలిస్తున్న నీటిని ఆపి కనీసం తాగునీటినైనా అందించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని, దీంతో పాటు, నీరు లేక ఎండిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు పరిహారమందించి ఆదుకోవాలన్నారు. చందవంచ సభలో చెప్పిన ప్రకారం నెలాఖరులోగా రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు.
ఇఫ్తార్‌లో మాజీ ఎమ్మెల్యే
జడ్పీటీసీ మాజీ సభ్యుడు సలీం ఆఽఽధ్వర్యంలో స్థానిక జామే మస్జిద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు పవి త్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేను మస్జిద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రామకృష్ణ, మండల అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు వీరారెడ్డి, శివకుమార్ కోస్గి, దౌల్తాబాద్, బీఆర్‌ఎస్ బొంరాస్‌పేట్ మండల నాయకులు పాల్గొన్నారు.