Share News

స్వయం ఉపాధి యూనిట్‌ నెలకొల్పాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:32 PM

మహిళా సంఘాల ద్వారా ప్రతీ మండలానికి ఒక స్వ యం ఉపాధి యూనిట్‌ నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులకు సూచించారు.

స్వయం ఉపాధి యూనిట్‌ నెలకొల్పాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మహిళా సంఘాల ద్వారా ప్రతీ మండలానికి ఒక స్వ యం ఉపాధి యూనిట్‌ నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి గ్రామీణాభివృద్ధి శాఖ అధికా రులకు సూచించారు. శుక్రవారం కలె క్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారులు ఏపీఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల స్వ యం ఉపాధి సాధికారత కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. స్వయం ఉ పాధి యూనిట్లు నెలకొల్పేలా మహిళా సంఘా లను ప్రోత్సహించాలని ఏపీఎంలను ఆదేశించా రు. పెట్రోల్‌ బంక్‌, గోదాములు, రైస్‌ మిల్లు మ రేదైనా వ్యాపారం మొదలు పెట్టేలా వారికి అవ గాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదన పు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ ఇన్‌చార్జి యాదయ్య, ఉమాదేవి, అరుణ, ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:32 PM